Telugu Global
Telangana

డీఏవీ స్కూల్ కి అనుమతి పునరుద్ధరణ.. కండిషన్స్ అప్లై

ప్రస్తుతం డీఏవీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా స్కూల్ కి తాత్కాలిక అనుమతులిచ్చారు అధికారులు. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డీఏవీ స్కూల్ కి అనుమతి పునరుద్ధరణ.. కండిషన్స్ అప్లై
X

ఎల్.కె.జి. విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ కి అనుమతి పునరుద్ధరించారు. ఈమేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ప్రస్తుతం డీఏవీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా స్కూల్ కి తాత్కాలిక అనుమతులిచ్చారు అధికారులు. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తల్లిదండ్రుల ఒత్తిడిపై..

దుర్ఘటన తర్వాత వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. డీఏవీ స్కూల్ అనుమతి రద్దు చేసి, స్కూల్ కి తాళం వేసింది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఈ విద్యా సంవత్సరానికి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. విద్యాశాఖ అధికారులకు పరుమార్లు విన్నపాలు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు స్కూల్ మార్చాలంటే తమ పిల్లలు ఇబ్బంది పడతారని, స్కూల్ ఫీజులు కూడా భారంగా మారతాయని చెప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుని స్కూల్ అనుమతి ఈ ఏడాది వరకు తాత్కాలికంగా పునరుద్ధరించింది.

రిమాండ్ లో ప్రిన్సిపల్, డ్రైవర్..

ఎల్.కె.జి. విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ రజినీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా అతడు ఇలానే ప్రవర్తించినా విషయం బయటకు రాలేదు. పాపం పండి ఇప్పుడు డ్రైవర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ సపోర్ట్ కూడా డ్రైవర్ కి ఉన్నట్టు తేలడంతో ఇద్దర్నీ జైలుకి పంపించారు. పోలీసులు వారిని ఇటీవల తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. స్కూల్ ఫీజులు కూడా డ్రైవర్ ఖాతాలో జమ అయ్యేవని గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాలు లొకేట్ చేయని ప్రదేశం ద్వారా చిన్నారులను డ్రైవర్ రజినీ కుమార్ డిజిటల్ రూమ్ లోకి తీసుకెళ్లి వేధించేవాడని నిర్థారించారు.

First Published:  1 Nov 2022 8:30 PM IST
Next Story