Telugu Global
Telangana

Tv9 రేటింగ్ తగ్గింది.. Rtv పండగ చేసుకుంటోంది

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో Tv9 పై ట్రోలింగ్ మొదలైంది. నూడుల్స్ చేయడం రెండే నిమిషాలు, No 1 పొజిషన్ కూడా కేవలం రెండే వారాలు అంటూ Tv9 కి చురకలంటిస్తున్నారు Rtv స్టాఫ్.

Tv9 రేటింగ్ తగ్గింది.. Rtv పండగ చేసుకుంటోంది
X

Tv9 రేటింగ్ తగ్గింది.. Rtv పండగ చేసుకుంటోంది

ఏడాది గ్యాప్ లో ఇటు తెలంగాణ, అటు ఏపీ అసెంబ్లీలతోపాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల సీజన్లో తెలుగు మీడియాలో వార్ మొదలైంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తీవ్ర యుద్ధమే జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు Ntv మేమే నెంబర్-1 అని చెప్పుకుంది.

రేటింగ్స్ ప్రకారం Tv9 కూడా సైలెంట్ గానే ఉంది. కానీ గతవారం రేటింగ్స్ తో Tv9కి ప్రచారం చేసుకునే ఛాన్స్ వచ్చింది. చాలాకాలం గ్యాప్ తర్వాత తిరిగి నెంబర్-1 రావడంతో Tv9 ప్రచారం ఓ రేంజ్ లో చేసింది. సోషల్ మీడియాలో హడావిడితోపాటు ఊరూవాడా బ్యానర్లు, ఫ్లెక్సీలు వేసింది. మోసం # N0-1.. మోసంతో ఎప్పటికీ నెంబర్-1 కాలేరు అంటూ హైదరాబాద్ లో హోర్డింగ్ లు పెట్టింది.

ఇక్కడ Ntvతోపాటు రవిప్రకాష్ సారథ్యంలో వస్తున్న Rtv ని కూడా Tv9 టార్గెట్ చేసినట్టయింది. ప్రస్తుతం Rtv డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనే ఉన్నా త్వరలో శాటిలైట్ కాబోతుందనే వార్తలు వినపడుతున్నాయి. కచ్చితంగా Tv9ని దెబ్బకొట్టాలనే Rtvతో రవిప్రకాష్ వస్తున్నారనే టాక్ వినబడుతోంది. దీంతో రేటింగ్స్ తోపాటు.. మోసం, దగా అంటూ Tv9 హోర్డింగ్ లతో రెచ్చగొట్టింది.

తాజాగా ఈవారం వచ్చిన రేటింగ్స్ లో మళ్లీ Tv9 పడిపోయింది, Ntv నెంబర్-1 స్థానంలోకి వచ్చింది. దీంతో Ntv కంటే ఎక్కువగా Rtv పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో Tv9 పై ట్రోలింగ్ మొదలైంది. నూడుల్స్ చేయడం రెండే నిమిషాలు, No 1 పొజిషన్ కూడా కేవలం రెండే వారాలు అంటూ Tv9 కి చురకలంటిస్తున్నారు Rtv స్టాఫ్. ప్రస్తుతం Rtv లో పనిచేస్తున్న చాలామంది గతంలో Tv9 కోసం చెమటోడ్చినవారే.

అప్పట్లో రవిప్రకాష్ తో పాటు ఆ టీమ్ లో కొంతమంది బయటకొచ్చారు. తర్వాత కూడా రవిప్రకాష్ అభిమానులు అనుకున్నవారిని ఒక్కొక్కరినే Tv9 యాజమాన్యం పక్కనపెడుతూ వచ్చింది. అలా బయటకు వెళ్లి వివిధ ఛానెళ్లలో ఉన్నవారంతా రవిప్రకాష్ పిలుపుతో మళ్లీ ఒకే దగ్గరకు చేరారు. సహజంగానే Tv9పై వీరికి కోపం ఉంది. ఆ కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నారు.



శాటిలైట్ హవా ఇంకెన్నాళ్లు..

శాటిలైట్ ఛానెల్స్ బ్రేకింగ్ లు, హడావిడికి కాలం దాదాపుగా చెల్లిపోయినట్టే చెప్పాలి. ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. కానీ డిజిటల్ లో అడ్వర్టైజ్ మెంట్లు, ప్రమోషన్ యాక్టివిటీస్ కి ఇంకా రూపు రేఖలు రాలేదు. దీంతో శాటిలైట్ ఛానెల్స్ పేరు చెప్పుకుంటేనే బిజినెస్ నడుస్తోంది, అందుకే వాటి ఉనికి కూడా కొనసాగుతోంది. ఈ దశలో ఇప్పుడు రేటింగ్స్ అంటూ మరోసారి హడావిడి మొదలైంది. రేటింగ్స్ ఫైటింగ్ కాస్తా ఇప్పుడు రచ్చకెక్కడం, మరీ రోడ్డెక్కి హోర్డింగ్ లతో గొడవపడటం మాత్రం కాస్త వింతగా ఉంది.

First Published:  1 Jun 2023 12:07 PM IST
Next Story