వెదర్ అలర్ట్.. రేపటి నుంచి హాట్ సమ్మర్ షురూ
పది పదిహేను రోజులపాటు అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని, మార్చి రెండో వారం నుంచి భానుడి భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణకు వాతావరణ సూచన.. ఫిబ్రవరి నెల ముగిసిపోతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఎండలు ముదరబోతున్నాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీల వరకు టెంపరేచర్ పెరుగుతోందని హెచ్చరించింది.
మార్చి రెండో వారం నుంచి మరింత
ఓ పది పదిహేను రోజులపాటు అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని, మార్చి రెండో వారం నుంచి భానుడి భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే తేలికపాటి జల్లులు కురిసే అవకాశమూ ఉందని తెలిపింది.
వింటర్‌లోనూ మంటలే
వాస్తవానికి ఇప్పుడు ముగిసిన వింటర్‌లోనూ చాలావరకు వేడి వాతావరణమే నడిచింది. డిసెంబర్ మూడో వారం వరకు చలి పుంజుకోలేదు. ఆ తర్వాత ఒక్క నెల రోజులే తెలంగాణ వ్యాప్తంగా బాగా చలి వాతావరణం ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు వేడి వాతావరణమే ఉంటుందని అప్పట్లో భారతీయ వాతావరణ సంస్థ (ఐఎండీ) ప్రకటించింది.