మళ్లీ తెలంగాణే టాప్..
GSDP గ్రోత్ రేట్ పై ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో తెలంగాణ టాప్ లో ఉండటంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి తెలంగాణ తన సత్తా చూపించిందని, జై తెలంగాణ అంటూ ట్వీట్ వేశారు.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్ లో ఉంది అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదని, గత పాలనకు, బీఆర్ఎస్ పాలనకు తేడా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు దీన్ని రుజువు చేస్తున్నాయని కూడా అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మద్దతుగా మరో సర్వే తెలంగాణ ఘనతను చాటి చెప్పింది. ద ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GSDP)లో తెలంగాణ.. దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉన్నట్టు ఇండియన్ ఇండెక్స్ స్పష్టం చేసింది.
Yet again Telangana is the Best performing state
— KTR (@KTRBRS) November 29, 2023
Jai Telangana ✊ https://t.co/2SPdHJcSf8
కేటీఆర్ ట్వీట్..
GSDP గ్రోత్ రేట్ పై ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో తెలంగాణ టాప్ లో ఉండటంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి తెలంగాణ తన సత్తా చూపించిందని, జై తెలంగాణ అంటూ ట్వీట్ వేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుందని ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో 11.97 పర్సంటేజ్ తో GSDP గ్రోత్ రేట్ లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కేరళ 11.93 పర్సంటేజ్ తో రెండో స్థానంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ 11.09 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం. రాజస్థాన్, హర్యానా, ఒడిశా.. వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. గోవా, పంజాబ్, హిమాచల్, తమిళనాడు.. ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి.
♦