ఎస్ టీచర్ అనక్కర్లేదు.. తెలంగాణలో విద్యార్థులకూ ఇక ఫేషియల్ రికగ్నేజేషన్ హాజరు
ఇందుకోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పనిచేసే ఓ యాప్‌ను కూడా రెడీ చేశారు. దీన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు టెక్నాలజీతో ముందుకెళ్తున్నాయి. ఇకపై విద్యార్థులకు హాజరు పట్టీల్లో అటెండెన్స్ వేసే పనిలేదు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో స్టూడెంట్స్ అడెంటెన్స్ తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పనిచేసే ఓ యాప్‌ను కూడా రెడీ చేశారు. దీన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
డీఎస్‌సీఎఫ్ఆర్‌సీ పేరుతో యాప్
విద్యార్థుల ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడానికి డీఎస్‌సీఎఫ్ఆర్‌సీ పేరుతో యాప్‌ను ప్రభుత్వం తయారు చేయించింది. ఇందులో ఒకసారి విద్యార్థుల కనురెప్పలు, కళ్లు, ముక్కు.. ఇలా మొత్తం 70 ఫేషియల్ రికగ్నైజేషన్ పాయింట్లు ఫీడ్ చేస్తారు. ఒక్కసారి విద్యార్థి ఫేషియల్ రీడింగ్ ఫీడ్ చేస్తే వారు డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య పూర్తయ్యేవరకు అవే సరిపోతాయి.
క్లాస్‌టీచర్ స్మార్ట్‌ఫోన్‌తో అటెండెన్స్
డీఎస్‌సీఎఫ్ఆర్‌సీ యాప్‌ను క్లాస్ టీచర్ లేదా హెడ్మాస్టర్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసి, విద్యార్థి ముఖం వైపు చూపిస్తే అటెండెన్స్ నమోదవుతుంది. ఒక్కో విద్యార్థినే కాదు ఒకేసారి 10, 15 మంది స్టూడెంట్స్‌ను పక్కపక్కన నిలబెట్టినా వాళ్లందరి ఫేషియల్ రికగ్నైజేషన్ ఒకేసారి చేసే స్థాయిలో ఈ యాప్‌ను తయారు చేశారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కూడా ఇదే పద్ధతిలో అటెండెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.