Telugu Global
Telangana

తెలంగాణ: ఆరోగ్య సంరక్షణకు ఈ ఏడాది ఓ మైలురాయి

ఈ సంవత్సరం ఆరంభమే కరోనా భీభత్సంతో మొదలైంది. అయినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణ కరోనాను అద్భుతంగా ఎదుర్కోగలిగింది. ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా తెలంగాణ ఆస్పత్రులు ఆశ్రయం కల్పించాయి.

తెలంగాణ: ఆరోగ్య సంరక్షణకు ఈ ఏడాది ఓ మైలురాయి
X

తెలంగాణలో ఈ ఎనిమిదేళ్ళలో వైద్య, ఆరోగ్య రంగం ఊహించని అభివృద్దిని సాధించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిని సాధించడం వల్ల ఆరోగ్య సంరక్షణ రంగానికి ఈ ఏడాది ఓ మైలు రాయిలా నిల్చిపోతుంది.

ఈ సంవత్సరం ఆరంభమే కరోనా భీభత్సంతో మొదలైంది. అయినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణ కరోనాను అద్భుతంగా ఎదుర్కోగలిగింది. ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా తెలంగాణ ఆస్పత్రులు ఆశ్రయం కల్పించాయి.

డిసెంబర్ 2021, మార్చి 2022 మధ్య ఒమిక్రాన్ అల్లకల్లోలం సృష్టించింది. దీనిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం , ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలను,ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలతో సహా మూడు స్థాయిల ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడం, పూర్తిగా కొత్త స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలను సృష్టించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రయత్నాలలో భాగంగా, 2022లో తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్‌లోని నాలుగు మూలల్లో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు - తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) స్థాపనకు 2,679 కోట్ల రూపాయలను మంజూరు చేయడం ఓ మూల మలుపు.

ఏప్రిల్ 2022 నుండి రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టి మొత్తం ప్రధానంగా ఇదే రంగం మీద కేంద్రీకరించింది. హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాల్లో కొత్త వైద్య మౌలిక సదుపాయాలు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు నిధులు విడుదల చేసింది. పబ్లిక్ హెల్త్ కేర్ రంగంలో మానవ వనరులను బలోపేతం చేయడానికి నడుం భిగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిలలో 13,000 పోస్టుల శాశ్వత నియామకాల కోసం దశల వారీ నోటిఫికేషన్ లను విడుదల చేసింది..

అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యపై దృష్టి సారించింది. కొత్తగా మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా కేంద్ర బీజేపీ సర్కార్ పట్టించుకోక పోవడంతో స్వయంగా తానే మొత్తం నిధులుమంజూరు చేసి నూతన మెడికల్ కాలీజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

అవస‌రమైన అధ్యాపకులను నియమించడం ద్వారా వైద్య విద్యను బలోపేతం చేయడం, అర్హులైన విద్యార్థుల కోసం MBBS మెడికల్ సీట్ల పూల్‌ను విస్తరించడం ద్వారా వైద్య విద్యను బలోపేతం చేసే మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

గత 12 నెలల్లో, తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులలో స్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యాల అభివృద్ధికి, 16 మెడికల్ కాలేజీలను, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హెల్త్ సిటీని స్థాపించడానికి 6,669 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

ఈ ఏడాది దసరా పండుగ నాటికి దేశంలోనే తొలిసారిగా ఒక్కరోజు వ్యవధిలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 4,080 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 1,200 మెడికల్ సీట్లు అదనంగా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

First Published:  31 Dec 2022 10:27 AM IST
Next Story