తెలంగాణ టీఆర్టీ.. రోస్టర్ పాయింట్లతో మహిళలు ఫుల్ హ్యాపీ
టీఆర్టీకి నేటినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి దరఖాస్తులు ఆన్ లైన్ లో నింపవచ్చు. అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశముంది.
తెలంగాణలో టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్(టీఆర్టీకి) నేటినుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే రోస్టర్ పాయింట్ల ప్రకారం ఖాళీలను ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రోస్టర్ పాయింట్ల చలవతో మహిళా అభ్యర్థులకే అత్యథిక ఖాళీలు దక్కాయి. దాదాపుగా 51శాతం ఖాళీలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
33శాతం రిజర్వేషన్ ఎలాగూ ఉంది. దానితోపాటు కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్లతో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అనే లెక్క తీశారు. దీంతో మహిళల కోటా పెరిగింది. మొత్తం 5,089 పోస్ట్ లు టీఆర్టీ ద్వారా డీఎస్సీ పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తారు. వీటిలో ఏకంగా 2,598 పోస్ట్ లు మహిళలకు రిజర్వేషన్లో దక్కాయి. మిగిలిన 2,491 పోస్ట్ లు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా పురుషులతో మహిళలు పోటీ పడతారు. అంటే 5,098 పోస్టుల్లో దాదాపు 60శాతం వరకు మహిళా అభ్యర్థులు దక్కించుకునే అవకాశముంది.
నేటినుంచి దరఖాస్తులు..
టీఆర్టీకి నేటినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి దరఖాస్తులు ఆన్ లైన్ లో నింపవచ్చు. అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశముంది. మరింత సమాచారాన్ని www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. నవంబర్ 20నుంచి పరీక్షలు మొదలవుతాయి.
మొత్తం పోస్ట్ లు 5,098
స్కూల్ అసిస్టెంట్లు - 1,739
ఎస్జీటీ - 2,575
లాంగ్వేజ్ పండిట్స్ - 611
పీఈటీ - 164