వైద్య విద్యలో తెలంగాణ రికార్డ్ ఇది -హరీష్ రావు
బోధనా నిపుణుల నియామకాలను కూడా రికార్డ్ స్థాయిలో చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా 1061మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందజేశారు.
వైద్యరంగంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చాలా పరిమితంగా ఉంటుంది. కానీ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చారు. మరో 9,222 పోస్ట్ లకు రెండు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అంతే కాదు, వైద్య విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి.. బోధనా నిపుణుల నియామకాలను కూడా రికార్డ్ స్థాయిలో చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా 1061మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందజేశారు. దేశంలోనే ఇది ఓ రికార్డ్ అని చెప్పారాయన.
వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని అన్నారు మంత్రి హరీష్ రావు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాల అందించారు. 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని చెప్పారు.
Hon’ble Minister @BRSHarish garu, Speaking after Distribution of Appointment orders to Newly Recruited Assistant Professors at Shilpakala Vedika, Hitec Cityhttps://t.co/fmauIuX7Kh
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 22, 2023
ఇది ట్రాక్ రికార్డ్..
తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖ ద్వారా ఉద్యోగాలు లభించాయి. మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్ రాబోతోంది. ఇక ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్ లో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేపడుతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, వాటిని 134కి పెంచుతున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ తెలంగాణకు ఒక ఎయిమ్స్ ఇచ్చినందుకే బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారని. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు హరీష్ రావు. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వివరించారు.