Telugu Global
Telangana

తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా

చిహ్నంలో మార్పులపై సంప్రదింపులు కొనసాగించాలని, జూన్ 2న జరిగే దశాబ్ధి వేడుకల్లో కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరించాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా
X

తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2న లోగోను ఆవిష్కరించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. చిహ్నంలో మార్పులపై సంప్రదింపులు కొనసాగించాలని, జూన్ 2న జరిగే దశాబ్ధి వేడుకల్లో కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరించాలని నిర్ణయించింది.

కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త లోగోపై కసరత్తు చేస్తోంది. కళాకారుడు రుద్ర రాజేశంకు లోగో బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు రుద్ర రాజేశం. ప్రజాస్వామికంగా ఉండడంతో పాటు ఉద్యమ తెలంగాణను ప్రతిబింబించేలా లోగో ఉండాలన్నారు.

చార్మినార్, కాకతీయ కళాతోరణంలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజముద్రను ఏర్పాటు చేసింది. అయితే రేవంత్ సర్కార్ చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరిక పోకడలన్న సాకుతో..లోగోను మార్చాలని మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే చార్మినార్, కాకతీయ కళాతోరణం లోగో నుంచి తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తెలంగాణ తల్లితో పాటు లోగో ఆవిష్కరణపై సంప్రదింపులు జరిపిన తర్వాతే మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

First Published:  30 May 2024 10:00 AM GMT
Next Story