Telugu Global
Telangana

స్థానికేతరులు వెళ్లిపోండి.. సైలెంట్ పీరియడ్ మొదలైంది

ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ ప్రదర్శించకూడదని, సభలు సమావేశాలు నిర్వహించకూడదని చెప్పారు. సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.

స్థానికేతరులు వెళ్లిపోండి.. సైలెంట్ పీరియడ్ మొదలైంది
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికేతరులు నియోజకవర్గాలు ఖాళీ చేసి వెళ్లాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఇతరులు నియోజకవర్గాల్లో కనపడకూడదన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ ను ప్రదర్శించకూడదని, సభలు సమావేశాలు నిర్వహించకూడదని చెప్పారు. సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

ఓటర్ల లెక్కలు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు 3.26 కోట్లు

పురుషులు 1,62,98,418

మహిళలు 1,63,01,750

థర్డ్ జెండర్ ఓటర్లు 2,676

కొత్తగా ఓటు హక్కు వచ్చినవారు 9,99,667

అభ్యర్థుల లెక్కలు

నియోజకవర్గాలు 119

బరిలో ఉన్న అభ్యర్థులు 2290

పురుషులు 2068

మహిళలు 221

ట్రాన్స్‌జెండర్‌ 1

పోలింగ్ కేంద్రాలు 35,356

పోలీస్ బలగాల లెక్కలు..

తెలంగాణ పోలీసులు 6వేలు

హోంగార్డ్ లు 18వేలు

కేంద్ర బలగాలు 375 కంపెనీలు

మొత్తం లక్షమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని, పార్టీలు, నాయకులు సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకూడదని చెప్పారు.

First Published:  28 Nov 2023 12:18 PM GMT
Next Story