Telugu Global
Telangana

ఏపీలో ఎలక్షన్స్.. TSRTC రికార్డ్ బ్రేక్

ఈ మూడు రోజుల్లో ఈ సర్వీసుల్ని ప్రజలు ఉపయోగించుకున్నారు. దీంతో ప్రయాణికుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించింది తెలంగాణ ఆర్టీసీ.

ఏపీలో ఎలక్షన్స్.. TSRTC రికార్డ్ బ్రేక్
X

ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో తెలంగాణ ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ రేషియోలో కొత్త రికార్డులను నమోదు చేసింది. మళ్లీ అలాంటి సీజన్ ఎప్పుడో అని ఎదురు చూస్తున్న టైమ్ లో ఏపీ ఎన్నికలు వచ్చాయి. ఏపీ ఎన్నికలకోసం వలస ఓటరు తరలి వెళ్లడంతో తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి రికార్డ్ ని బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్‌తో పోలిస్తే 10 శాతానికి పైగా ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 1.42 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

ఏపీకి వెళ్లే ప్రయాణికులకోసం తెలంగాణ ఆర్టీసీ టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీ వైపుకి ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేసింది. వాటికి అదనంగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టింది. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో ఈ సర్వీసుల్ని ప్రజలు ఉపయోగించుకున్నారు. దీంతో ప్రయాణికుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించింది తెలంగాణ ఆర్టీసీ.

తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలిచ్చారు. మొత్తమ్మీద ఏపీ ఎన్నికల వేళ, టీఎస్ఆర్టీసీ రికార్డులు బ్రేక్ చేసింది.

First Published:  12 May 2024 1:54 PM GMT
Next Story