Telugu Global
Telangana

TSRTC రాఖీ కానుక.. రూ.5.5 లక్షల బహుమతులు

ఈ నెల 30, 31 తేదీల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికులు ఈ బహుమతులకు అర్హులు. ప్రయాణం చేసిన తర్వాత టికెట్ వెనక వారి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వాటిని వేయాలి.

TSRTC రాఖీ కానుక.. రూ.5.5 లక్షల బహుమతులు
X

రాఖీ పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించినవారిలో లక్కీడ్రాలో కొంతమందిని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తామని తెలిపింది. ఆషామాషీ బహుమతులు కాదు, వాటి విలువ దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు ఉంటుంది. ఆ స్థాయిలో బహుమతులతో తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ కానుక ఇవ్వబోతోంది TSRTC.

బహుమతి రావాలంటే ఏం చేయాలి..?

ఈ నెల 30, 31 తేదీల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికులు ఈ బహుమతులకు అర్హులు. ప్రయాణం చేసిన తర్వాత టికెట్ వెనక వారి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వాటిని వేయాలి. 30, 31 తేదీల్లో ఆ టికెట్లను తీసి లక్కీ డ్రా నిర్వహిస్తారు అధికారులు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు అందిస్తారు.


33మందికి రూ.5.5 లక్షలు

మొత్తం 33మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఐదున్నర లక్షల రూపాయల విలువైన బహుమతులు అందిస్తామని తెలిపారు TSRTC అధికారులు. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని, వారికి అన్నదమ్ములు ఇచ్చే బహుమతులతోపాటు, ఆర్టీసీ కూడా బహుమతులు ఇస్తుందని తెలిపారు. సెప్టెంబర్-9న విజేతలను ప్రకటించి బహుమతులు అందజేస్తామన్నారు TSRTC ఎండీ సజ్జనార్.

First Published:  29 Aug 2023 8:23 PM IST
Next Story