మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించిన తెలంగాణ
నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22ని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) సహకారంతో ఫిబ్రవరి 2021 నుండి మే 2022 ఈ సర్వే వరకు నిర్వహించింది.
అత్యధిక తలసరి ఆదాయం, అటవీ విస్తీర్ణం పెరుగుదల తదితర పారామీటర్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు ఇండియన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (IMII) ర్యాంకింగ్స్ 2022లో రెండవ స్థానంలో నిల్చింది.
ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో IMII స్కోర్‌లో తెలంగాణకన్నా ఒక శాతం కంటే తక్కువ తేడాతో కర్ణాటక మొదటి స్థానంలో నిల్చింది.
నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22ని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) సహకారంతో ఫిబ్రవరి 2021 నుండి మే 2022 ఈ సర్వే వరకు నిర్వహించింది.
కరోనా కాలంలో 28 రాష్ట్రాలు, 6 UTలలో (లక్షద్వీప్ మినహా) ఉన్న 10,139 సంస్థలలో 8,087 సంస్థలతో సర్వే పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. సర్వేలో రెండు నిర్దిష్ట భాగాలు ఉన్నాయి - సంస్థ-స్థాయి సర్వే, సెక్టోరల్ సిస్టమ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ (SSI) సర్వే.
తయారీ సంస్థలు, సమాచారం, విజ్ఞానం, సాంకేతికతలు, పద్ధతులు, మానవ, ఆర్థిక వనరులను ఎలా వినియోగించుకున్నాయో పరిశీలించారు. ఆహారం, పానీయాలు, వస్త్రాలు, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ICT) సహా ఐదు కీలక తయారీ రంగాలపై ఈ సర్వే దృష్టి సారించింది.
ఈ సర్వే ప్రకారం, తెలంగాణ 32.86 IMII స్కోర్‌తో రెండవ స్థానంలో, కర్ణాటక 33.41 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉండగా, జాతీయ సగటు స్కోరు 28.17 వద్ద ఉంది.
ముఖ్యంగా ఇన్నోవేషన్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్‌మెంట్‌లో కర్ణాటక, తెలంగాణలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, ఫలితంగా మెరుగైన ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని ఈ సర్వే తెలిపింది.
ఈ అంశాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,తయారీ రంగంలో తెలంగాణ నాయకత్వం మరో సారి రుజువయ్యింది అని కామెంట్ చేశారు.నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22ని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) సహకారంతో ఫిబ్రవరి 2021 నుండి మే 2022 ఈ సర్వే వరకు నిర్వహించింది.
Telangana's leadership in the manufacturing sector reaffirmed!#TriumphantTelangana ranked 2nd among major States in the decennial Indian Manufacturing Innovation Index (IMII) Rankings 2022.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 5, 2023
The rankings are released as part of the National Manufacturing Innovation Survey… pic.twitter.com/9DKSUylyQl