చోరీకి గురైన ఫోన్ల రికవరీ...తెలుగు రాష్ట్రాల ర్యాంక్ ఎంతంటే!
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,913 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. గత 8 రోజుల్లోనే ఏకంగా 1000 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. రోజూ దాదాపు 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా.. మహారాష్ట్ర మూడు, ఆంధ్రప్రదేశ్ నాలుగు స్థానాల్లో నిలిచాయి.
సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్లశాఖ CEIR పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణలో 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్‌లో ఈ పోర్టల్ ద్వారా పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు.