Telugu Global
Telangana

‘సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీసులు

‘‘టెక్నాలజీ, భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారు. సైబర్ అంబాసిడర్‌లుగా, సురక్షితమైన కమ్యూనిటీని నిర్మించేందుకు కృషి చేయడం యువతరం బాధ్యత'' అని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.

‘సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీసులు
X

విద్యార్థుల్లో సైబర్ క్రైమ్ గురుంచి, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో, తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం బుధవారం ‘సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫామ్’ (CAP) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పాఠశాల విద్యా శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులను సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌లుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

డిజిపి అంజనీ కుమార్, ఇతర అధికారుల సమక్షంలో హోంమంత్రి మహమూద్ అలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫారమ్ అత్య‌వసరం అని ఆయన అన్నారు.

‘‘టెక్నాలజీ, భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారు. సైబర్ అంబాసిడర్‌లుగా, సురక్షితమైన కమ్యూనిటీని నిర్మించేందుకు కృషి చేయడం యువతరం బాధ్యత'' అని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.

సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫామ్ (CAP) మొదటి దశలో ప్రభుత్వ, రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్‌తో సహా 2,381 పాఠశాలల నుండి 9,424 సైబర్ అంబాసిడర్‌లకు మహిళా భద్రతా విభాగం శిక్షణ ఇస్తుంది.

First Published:  11 Jan 2023 8:33 PM IST
Next Story