Telugu Global
Telangana

ఆపరేషన్ కమల్.. అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే..?

మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్ కమల్ విజయవంతం అయినా, ఢిల్లీలో మాత్రం బెడిసికొట్టింది. పంజాబ్, జార్ఖండ్ లో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ఘోరంగా విఫలమైంది. ఏకంగా డబ్బు సంచులతో ముఠా పట్టుబడింది.

ఆపరేషన్ కమల్.. అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే..?
X

కర్నాటకలో సక్సెస్..

మహారాష్ట్రలో గ్రాండ్ సక్సెస్..

గోవాలో సూపర్ హిట్..

ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అలర్ట్ తో ఫ్లాప్..

పంజాబ్ లో ముందుగానే గుట్టు రట్టు..

జార్ఖండ్ లో తప్పిన ముప్పు..

తెలంగాణలో నగదుతో సహా ముఠా అరెస్ట్..

దేశవ్యాప్తంగా ఆపరేషన్ కమల్ ఫలితాలివి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుని నీచ‌ రాజకీయాలు చేయాలని చూస్తోంది బీజేపీ. మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్ కమల్ విజయవంతం అయినా, ఢిల్లీలో మాత్రం బెడిసికొట్టింది. పంజాబ్, జార్ఖండ్ లో కూడా అదే పరిస్థితి. కానీ అక్కడ ఆపరేషన్ గురించిన సమాచారమే కానీ ఆధారాలు, రుజువులు లేవు. తెలంగాణలో మాత్రం ముఠా డబ్బు సంచులతో పట్టుబడింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూ పోలీసులకు చిక్కింది.

పక్కా ప్లాన్ తో ఇరికించారు..

దేశవ్యాప్తంగా బీజేపీ ఇలాంటి నీచ‌ రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమైన తర్వాత ఆ పార్టీ సైలెంట్ గా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందుకే ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ఎమ్మెల్యేకు 100కోట్ల రూపాయలు, కాంట్రాక్ట్ లు ఇస్తామంటూ నమ్మబలికింది. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిని సంప్రదించింది. కానీ వారు అలర్ట్ అయ్యారు. అమ్ముడుపోవడం ఇష్టంలేని ఆ నలుగురు.. బీజేపీని అలాగే వదిలేస్తే తెలంగాణలో రాజకీయ కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని ముందస్తుగా సమాచారాన్ని సీఎం కేసీఆర్ కి చేరవేశారని చెబుతున్నారు. పక్కా ప్లాన్ తోనే డబ్బు సంచులతో ఆ ముఠా పట్టుబడేలా వ్యూహం పన్నారు. చివరకు పోలీసులకు ఆ ముఠా దొరికింది.

దేశవ్యాప్తంగా సంచలనం..

గతంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే తనకు 20కోట్ల రూపాయలు ఇవ్వజూపారంటూ ఆరోపణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. గోవా ఎమ్మెల్యేలకు ముట్టిన సొమ్ము గురించి వార్తలొచ్చినా రుజువులు లేవు. కానీ ఇప్పుడు మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో డబ్బు సంచులు కూడా దొరకడంతో కమలం గుట్టు బయటపడింది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాల విషయం సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. సహజంగానే ఆ డబ్బు మాది కాదు, ఆ ముఠాతో మాకు సంబంధం లేదని బీజేపీ నేతలు బుకాయిస్తున్నా.. వారి బంధుత్వాలు, రాజకీయ సంబంధాలు ఇప్పటికే బహిరంగమయ్యాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు బయటపడబోతున్నాయి.

First Published:  27 Oct 2022 7:44 AM IST
Next Story