Telugu Global
Telangana

తెలంగాణ నాట్ ఫర్ సేల్.. హోరెత్తిన సోషల్ మీడియా..

ట్విట్టర్లో తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. బీజేపీ కుట్రను బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలను తెలంగాణ హీరోలంటూ కీర్తించారు నెటిజన్లు.

తెలంగాణ నాట్ ఫర్ సేల్.. హోరెత్తిన సోషల్ మీడియా..
X

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వెలుగు చూసిన తర్వాత సోషల్ మీడియా హోరెత్తిపోయింది. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ వ్యవహారం బయటపడటంతో చాలామంది మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు హైలెట్ అయ్యాయి. ట్విట్టర్లో #TelanganaNotForSale అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. బీజేపీ కుట్రను బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలను తెలంగాణ హీరోలంటూ కీర్తించారు నెటిజన్లు.

పొరపాటున దొరికిపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుమానం వచ్చేలా సీన్ క్రియేట్ చేయాలని చూసింది బీజేపీ. కానీ ముందుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమాచారాన్ని పోలీసులకు, పార్టీ అధినేతకు తెలియజేయడంతో వారిపై బురదజల్లే ఛాన్స్ బీజేపీ మిస్సయింది. ఆ నలుగురు ఇచ్చిన సమాచారంతోనే తాము ఆ ముఠాను అరెస్ట్ చేశామని తేల్చి చెప్పారు పోలీసులు. అంటే ఈ కుట్రను ఛేదించింది ఎమ్మెల్యేలే, కుట్రను బయటపెట్టింది, బీజేపీ కుతంత్రాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించింది ఎమ్మెల్యేలే. దీంతో సోషల్ మీడియా.. వారికి బ్రహ్మరథం పట్టింది.

పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి.. ఒక్కసారిగా తెలంగాణ హీరోలయ్యారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అమ్ముడవుతారేమో కానీ, తెలంగాణలో మాత్రం అది సాధ్యం కాదని తేల్చారు. దీంతో తెలంగాణ నాట్‌ ఫర్‌ సేల్‌ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ఇలాంటి కొనుగోళ్లకు వ్యతిరేకమని, బీజేపీ చర్యలను సహించేది లేదని నెటిజన్లు హెచ్చరించారు. బీజేపీ సిద్ధాంతాలను వదిలేసి, ప్రజాప్రతినిధులను ఆంగట్లో సరుకులా కొనుగోలు చేస్తోందని విమర్శించారు. అమిత్‌ షా లావాదేవీ తెలంగాణలో ఫెయిల్‌ అంటూ ట్వీట్లు వేశారు.

First Published:  27 Oct 2022 8:53 AM IST
Next Story