సచివాలయ పనులు పరిశీలించిన కేసీఆర్.. ప్రారంభం ఎప్పుడంటే..?
జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లారు.
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నూతన భవనం దగ్గరకు వెళ్లి పనులు జరుగుతున్న తీరుని ఆయన నేరుగా పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హడావిడి లేకుండా పనుల్ని నింపాదిగా చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ ౩౦న తెలంగాణ సచివాలయం ప్రారంభించబోతున్నారు.
నూతనంగా నిర్మితమౌతున్న డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని పర్యవేక్షించిన సీఎం శ్రీ కేసీఆర్.
— BRS Party (@BRSparty) March 10, 2023
CM Sri KCR inspected the progress of ongoing construction works of Dr. B.R Ambedkar Telangana State Secretariat. pic.twitter.com/cmLkpodTKf
సచివాలయ పనుల పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాతా మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ ఉన్నారు. జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లారు.
2019 జూన్ 27న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నిర్మాణం మొదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఆధునిక సౌకర్యాలు, వసలు, అధునాతన ఫర్నిచర్ తో సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా 610 కోట్ల రూపాయల వ్యయంతో సచివాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఏప్రిల్-౩౦న తెలంగాణ సచివాలయం ప్రారంభిస్తారు.