పోషకాహార లోపానికి భజనలే పరిష్కారమా ? అదీ మోడీ నోటి వెంట'.. హవ్వ ! -కేటీఆర్
ప్రధానిమోడీపై సెటైర్ వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఇండియాలో పోషకాహార లోపం తగ్గడానికి భజన ఈవెంట్లు పనిచేస్తాయన్న మోడీ వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యగ్యంగా స్పందించారు.
దేశంలో పోషకాహార లోపానికి పరిష్కారంగా భజన కార్యక్రమాలు భేషంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. బహుశా 'భోజనం' అన్నదానికి 'భజన' అని టెలిప్రాంప్టర్ లో తప్పుగా టైప్ అయి ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా 101/116 వ స్థానంలో ఉందని, పోషకాహారలోపానికి సంబంధించిన సమస్యపై మనం తక్షణం దృష్టి నిలపాల్సి ఉందని ఆయన అన్నారు. అంతే తప్ప ఇలాంటి కామిక్ వ్యాఖ్యలపై కాదని పేర్కొన్నారు. ఇండియాలో పోషకాహార లోపాన్ని తగ్గించాలంటే దీనికి పరిష్కార మార్గాల్లో భజనల ఈవెంట్లు కూడా ఉంటాయని, అవి ఇందుకు దోహదపడతాయని మోడీ ఇటీవల తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో వ్యాఖ్యానించారు. పైగా ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ సమస్యకు సొల్యుషన్ భజనలు కావని, మొదట చిత్తశుద్ధి అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.