సండే పాప్ క్విజ్.. నీతి ఆయోగ్ పై కేటీఆర్ సెటైర్
ఈ రోజు ఢిల్లీ లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిష్కరించిన నేపథ్యంలో కేటీఆర్ నీతి ఆయోగ్ పై సెటైర్లు వేశారు. ఇవ్వాళ్ళ జరుగుతుంది ''సండే పాప్ క్విజ్" అని ఎద్దేవా చేశారు.
నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెరైటీగా సెటైర్ వేశారు. ఢిల్లీలో ఆదివారం ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరుగుతున్న సందర్భంగా ఆయన . ట్వీట్ చేస్తూ..ఇది ''ఆదివారం పాప్ క్విజ్" అని ఎద్దేవా చేశారు. 'కొన్నేళ్ల క్రితం భారీ హంగామాతో ఓ సలహా సంఘం ఏర్పడింది. కానీ ప్రధాన మంత్రి గానీ, ఆయన కేబినెట్ గానీ ఆ సంఘాన్ని పట్టించుకోలేదు. వారి సలహాలు వినలేదు. ఆ సంఘం పట్ల పూర్తి ధిక్కారం, నిర్లక్ష్యంతో ఉన్నారు.. ఆ సంఘం పేరు చెప్పగలరా ?'' అని కేటీఆర్ ప్రశ్నించారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మీటింగ్ ని బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా బాయ్ కాట్ చేయడం విశేషం. కేసీఆర్ నిర్ణయాన్ని సీపీఎం సమర్థించింది. ప్రణాళికా సంఘం మాదిరే నీతి ఆయోగ్ కూడా ముఖ్య పాత్రను పోషించడంలో విఫలమైందని సీపీఎం వ్యాఖ్యానించింది.