దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో 3వేలు పింఛన్ ఇవ్వండి -హరీష్ రావు సవాల్
బీజేపీ నాయకులు ఇస్తున్న తప్పుడు హామీల పై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దుబ్బాక, హుజురాబాద్ లో గెలిస్తే 3వేల పింఛన్ ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పా రు. ఇప్పుడు మునుగోడులో అవే అబద్దపు హామీలు ఇస్తున్నారని హరీష్ రావు ద్వజమెత్తారు.
మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారని, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే హామీలిచ్చి మొండిచేయి చూయించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఇచ్చి న హామీలపై మీడియా సమావేశంలో వీడియోలను ప్రదర్శించారు హరీష్ రావు.
దుబ్బాక, హుజురాబాద్ లో గెలిస్తే 3వేల పింఛన్ ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పా రు. ఇప్పుడు మునుగోడులో అవే అబద్దపు హామీలు ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.'' ప్రధాన మం త్రి సొంత రాష్ట్రం గుజరాత్ లోనే 750 రూపాయలు,బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో 600 రూపాయల పిం ఛన్లు ఇస్తున్నా రు. బీజేపీ నేతలు జుమ్లా,ఝూటమాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని కల ముం దు ఎన్నో ఫాల్స్ హామీలు ఇస్తాం అవన్నీ నమ్ము తారా అని ఓ ప్రెస్ మీట్ లో స్వ యం గాఅమిత్ షా చెప్పా రు. ఒక ఓటు రెం డు రాష్టాల హామీ నుంచి ఝూట, జుమ్లా కొనసాగుతూ వస్తోం ది.'' అని హరీష్ రావు అన్నారు.
రెం డో సారి గెలిస్తే రెం డు వేలు పెన్షన్ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చి న వెం టనే పెన్షన్ ఇచ్చి న ఘనత కేసీఆర్ దని, బీజేపీ నేతలకు దమ్ముంటే వారి పార్టీ పాలిస్తున్న రాష్టాల్లో 3వేలు పింఛన్ ఇవ్వండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు హరీష్ రావు.
మునుగోడుదు ప్రజలను బీజేపీ నాయకులుమోసం చేయలేరని, రావినారాయణరెడ్డి లాం టి పోరాట యోధులు జన్మిం చిన పోరాటాల గడ్డపై ఉన్న ప్రజల్ని మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని హరీష్ రావు అన్నారు.