Telugu Global
Telangana

తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఉంటాయని మంత్రి చెప్పారు.

తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్ కనిపిస్తుంది. మన రాష్ట్రంలో ఎంతో సామరస్యమైన వాతావరణం ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో సుఖ, శాంతులతో జీవిస్తున్నారు. గత ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని వాడుకున్నాయని మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాహిత్య దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో బహు భాషా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హోం మంత్రి మహబూబ్ అలీతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించి, మాట్లాడారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఉంటాయని మంత్రి చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అవార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని, తెలంగాణ అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కవితల పోటీ ఉంటుందని అన్నారు. ఇందులో గెలుపొందిన వారికి జిల్లా, రాష్ట్ర స్థాయి బహుమతులు అందిస్తామని చెప్పారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన కవులను సన్మానించి, పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరేటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపిక రెడ్డి, అధికార భాష సంఘం చైర్మన్ శ్రీదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


First Published:  11 Jun 2023 10:29 AM GMT
Next Story