Telugu Global
Telangana

పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దక్షిణాదిలో అగ్రగామి, దేశంలో మూడవ స్థానం

ఉత్పత్తితో పాటు కార్మికులకు చెల్లించే పత్తి లేబర్ రేటు విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ రెండవ అగ్రగామి రాష్ట్రం. కేరళలో గంటకు కూలీ రేటు రూ.117.88 కాగా, తెలంగాణలో గంటకు రూ.98.36గా ఉంది. గుజరాత్, కర్ణాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా రూ.35.16, రూ.49.35గా ఉంది.

పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దక్షిణాదిలో అగ్రగామి, దేశంలో మూడవ స్థానం
X

తెలంగాణ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండగా, , దేశంలో మూడవ స్థానంలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ 2020-21లో 57.97 లక్షల బేళ్ల ఉత్పత్తితో, 2021-22లో 48.78 లక్షల బేళ్లతో పత్తి ఉత్పత్తితో మూడవ అగ్రగామి రాష్ట్రంగా గా నిలిచింది.

ఉత్పత్తితో పాటు కార్మికులకు చెల్లించే పత్తి లేబర్ రేటు విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ రెండవ అగ్రగామి రాష్ట్రం. కేరళలో గంటకు కూలీ రేటు రూ.117.88 కాగా, తెలంగాణలో గంటకు రూ.98.36గా ఉంది. గుజరాత్, కర్ణాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా రూ.35.16, రూ.49.35గా ఉంది.

ఈ వివరాలన్నింటినీ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జోర్దాష్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భారత్ పత్తి ఎగుమతి చేసే దేశమని,మొత్తం ఉత్పత్తిలో దేశంలో వినియోగం కంటేఎగుమతులే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నారు.

First Published:  6 April 2023 8:27 AM IST
Next Story