చెరిపేస్తే చెరగని సత్యం.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
తాజాగా ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ. 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
ప్రజల తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే టాప్ రేస్‌లో దూసుకుపోతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెండురెట్లు మెరుగ్గా ఉందని ఇప్పటికే అనేక ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజల ఆదాయం మెరుగుపడినట్లు అనేకసార్లు రుజువైంది.
తాజాగా ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ. 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. అయినప్పటికీ ఏం చేశావ్ కేసీఆర్ అంటూ మీడియా, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటాయని ట్వీట్ చేశారు. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని ట్వీట్‌లో చెప్పుకొచ్చారు కేటీఆర్.
₹ 3.09 లక్షల తలసరి ఆదాయం తో పెద్ద రాష్ట్రాల లో దేశం లోనే తెలంగాణ No -1.
— KTR (@KTRBRS) April 1, 2024
అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి..
చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ గారు సాధించిన ఆర్థిక ప్రగతి.
జై తెలంగాణ! pic.twitter.com/JkIqzxqyMM
తన ట్వీట్‌కు ది మ్యాప్స్ డైలీకి సంబంధించిన ఇమేజ్‌ను జత చేశారు. జాతీయ తలసరి ఆదాయ సగటు రూ.1.72 లక్షలుగా ఉండగా.. అది తెలంగాణ రాష్ట్రం విషయంలో రూ.3.09 లక్షలుగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014-15లో తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ 11వ స్థానంలో ఉండేది.