దేశంలో విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఆర్‌ఎస్పీ
తెలంగాణలో డీఎస్సీ ఫలితాల విడుదలలో జరుగుతున్న జాప్యంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దేశంలో విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు నిర్వహించిందని అభ్యర్థులు ఎగ్జమ్ వాయిదా వేయాలని అనేక సార్లు వేడుకున్న హడావుడిగా పరీక్ష నిర్వహించందని ఆయన అన్నారు. పరీక్ష పలితాలు విడుదల చేయటంలో జాప్యం ఎందుకు ఆర్‌ఎస్పీ ప్రశ్నించారు.
వారం రోజులో డీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పి నెలలు అయిందని ఇంక రిజల్ట్స్ విడుదల చేయకపోవడం దారుమని ఆయన అన్నారు. జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేస్తే వారు స్కూల్‌కి పిల్లలకు పాఠాలు బోధిస్తారని ప్రవీణ్ పేర్కొన్నారు. గురుకుల టీచర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవని ఆయన అన్నారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్మంతా కొడంగల్‌కు, ఢిల్లీకి తరిలించారని ఆరోపించారు. హైడ్రా పేరుతో అందరి దృష్టి మళ్లించి వచ్చే ఏడాది నుండి నియామక పత్రాలు ఇవ్వాలని చూస్తుందని ఆయన తెలిపారు.