Telugu Global
Telangana

15 రోజుల ముందే రిజ‌ల్ట్స్‌.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు 24న విడుద‌ల

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవత్సరాల ప‌రీక్ష‌ల‌ను మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాశారు. మార్చి 10 నుంచి వాల్యుయేష‌న్ ప్రారంభించారు.

15 రోజుల ముందే రిజ‌ల్ట్స్‌.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు 24న విడుద‌ల
X

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విడుద‌ల‌కు డేట్ ఫిక్స‌యింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు రిజ‌ల్ట్స్ విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి రిలీజ్‌ చేయ‌నున్నారు.

9.80 ల‌క్ష‌ల మంది విద్యార్ధుల ఫ‌లితాలు

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవత్సరాల ప‌రీక్ష‌ల‌ను మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాశారు. మార్చి 10 నుంచి వాల్యుయేష‌న్ ప్రారంభించారు. నెల రోజుల త‌ర్వాత ఈ నెల 10న పూర్తిచేశారు. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబుపత్రాలను మూడేసిసార్లు రీవెరిఫై చేశారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తిచేసి, ఫ‌లితాల విడుద‌ల‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఈసారి 15 రోజుల ముందే..

గ‌త ఏడాది మే 9న ఇంట‌ర్ ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మే 13న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసారి ప‌రీక్ష‌లు, ఫ‌లితాల విడుద‌ల అన్నీ ముందుకు జ‌రిపారు. ఏపీలో ప‌ది రోజుల కింద‌టే ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు విడుద‌ల చేసేశారు.

First Published:  21 April 2024 4:21 AM GMT
Next Story