ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వివరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్/ ఒకేషనల్ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు రెండో శనివారం, ఆదివారాల్లో జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ప్రతి రోజూ రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వివరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్టు తెలిపారు.