తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు నిర్వహించనున్నారు. కాబట్టి ఆ రూట్లో కూడా పరిమితంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలియజేశారు.
తొలి రోజు ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీంతో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసేస్తారు. ఆ రూట్లో వాహనాలను అనుమతించరు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు నిర్వహించనున్నారు. కాబట్టి ఆ రూట్లో కూడా పరిమితంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
- పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య జంక్షన్ నుంచి నిరంకారి భవన్, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్, ఇక్బాల్ మినార్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రవీంద్ర భారతి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు, బీజేఆర్ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్ జంక్షన్, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.
- వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు.
- ఖైరతాబాద్ ఫైవోవర్ పైకి వచ్చే వాహనాలు.. వీవీ విగ్రహం నుంచి షాదన్ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదన్ కాలేజీ నుంచి సోమాజీగూడ రూట్‌లో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపి వేస్తారు.
- ఇక్బాల్ మినార్ నుంచి ట్యాంక్‌బండా పైకి వాహనాలను అనుమతించరు.
- ఈ వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగు తల్లి ఫ్లైవోవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
- అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్ పై నుంచి కాకుండా తెలుగుతల్లి ఫ్లైవోవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడీగూడ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.
- ట్యాంక్‌బండి, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోకి కూడా అనుమతి ఉండదు. వీటిని కూడా ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
- బడాగణేష్ లైన్ నుంచి ఐమ్యాక్స్, నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలన్నీ.. రాజ్‌దూత్ హోటల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
- మింట్ రోడ్ నుంచి బడా గణేష్ రోడ్డులోకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలు తెలుగుతల్లి ఫ్లైవోవర్ వైపు మళ్లిస్తారు.