Telugu Global
Telangana

ABNపై హైకోర్టు సీరియస్..

న్యాయవ్యవస్థను దిగజార్చేలా ఈ చర్చలున్నాయంటూ జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. అవినాష్ రెడ్డికి బెయులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో ఆ రెండు ఛానెళ్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABN Newsపై హైకోర్టు సీరియస్..
X

ABNపై హైకోర్టు సీరియస్..

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సందర్భంగా తెలుగు మీడియా హడావిడి అంతా ఇంతా కాదు. ఓ దశలో అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందులకు వెళ్లే సమయంలో మీడియా ఆయన కాన్వాయ్ ని వెంటాడింది కూడా అటు కర్నూలు ఆస్పత్రి వద్ద కూడా మీడియాకి అవినాష్ అనుచరులకు మధ్య జరిగిన గొడవ తెలిసిందే.


మీడియాది అతి అని అవినాష్ వర్గం ఆరోపిస్తుంది, అది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ఆయా ఛానెళ్ల వారు తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఛానెళ్లలో నిర్వహించిన చర్చా కార్యక్రమాలు ఏకంగా కోర్టులోనే చర్చకు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో జరుగుతుండగా.. ఆ విచారణపై మహాటీవీ, ఏబీఎన్ ఛానెళ్లలో ప్రసారమైన చర్చలు సంచలనంగా మారాయి. న్యాయవ్యవస్థను దిగజార్చేలా ఈ చర్చలున్నాయంటూ జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. అవినాష్ రెడ్డికి బెయులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో ఆ రెండు ఛానెళ్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఆ రెండు ఛానెళ్లపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.




తీర్పు కాపీలో సైతం ఆ రెండు ఛానెళ్ల ప్రసారాల గురించి ప్రస్తావించారు జస్టిస్ లక్ష్మణ్. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇలాంటి చర్యలపై న్యాయ వ్యవస్థ కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు లక్ష్మణ్. వ్యక్తిగత వ్యాఖ్యలతో తానెప్పుడూ బాధపడలేదని.. కానీ మీడియా ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాన్ని తాను తప్పుబడుతున్నానని చెప్పారు.


ఓ దశలో ఈ వ్యవహారం గురించి ప్రస్తావించకూడదని అనుకున్నానని, అయినా కోర్టు ధిక్కార చర్యలను సమర్థించడం కూడా సరికాదనే ఉద్దేశంతోటే తాను ఈ ప్రస్తావన చేశానని చెప్పారు. మహా న్యూస్, ఏబీఎన్ ఛానెళ్లలో జరిగిన చర్చకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను ప్రధాన న్యామూర్తికి పంపించాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించారు జస్టిస్ లక్ష్మణ్.

First Published:  31 May 2023 12:02 PM IST
Next Story