తెలంగాణలో హై స్కూల్ టైమింగ్స్ మార్పు
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు హైదరాబాద్ మినహా తెలంగాణ అంతా అమలవుతాయి.
తెలంగాణలో హైస్కూల్ టైమింగ్స్ మారాయి. ఇప్పటి వరకు ఉదయం 9.30 గంటలకు ఉన్నత పాఠశాలలు ప్రారంభం అవుతుండగా, ఇకపై 9 గంటలకే మొదలవుతాయి. ఈమేరకు అరగంట ముందుగా పాఠశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం అరగంట ముందుగా స్కూల్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనివేళలు ఉండగా.. ఇకపై ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4.15 గంటలకు పనివేళలను మారుస్తున్నారు.
హైదరాబాద్ లో ఇలా..
హైదరాబాద్ లో హై స్కూల్స్ పనివేళలు ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నాయి. ఇవి యథాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు హైదరాబాద్ మినహా తెలంగాణ అంతా అమలవుతాయి. హైదరాబాద్ లో మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8.45 గంటలకే స్కూల్స్ మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే హైస్కూల్స్ లో బోధన ముగుస్తుంది.
ఇటు ఏపీలో కూడా స్కూల్ టైమింగ్స్ మార్చాలనే చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో హై స్కూల్ టైమింగ్స్ ప్రస్తుతం 9 గంటలనుంచి 4 గంటల వరకు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఈ కొత్త టైమింగ్స్ తీసుకొచ్చారు. వీటిని పాత విధానంలోకి మార్చాలని టీచర్లు అడుగుతున్నట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మాత్రం స్కూల్ టైమింగ్స్ ని అరగంట ముందుకు జరపడం విశేషం.