Telugu Global
Telangana

వాన్‌పిక్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

ఈ తీర్పును హైకోర్టు తప్పుపడుతూ పక్కన పెట్టింది. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులు చట్ట విరుద్ధ‌మని ఒకవైపు చెప్పిన అప్పిలెట్ అథారిటీ మరోవైపు జప్తు భూముల వ్యవహారంలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా చెప్పడం సరైనది కాదని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అభిప్రాయపడింది.

వాన్‌పిక్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
X

వాన్‌పిక్ భూముల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను క్విడ్ ప్రోకోలో భాగంగా భూముల కేటాయింపు జరిగిందంటూ ఈడీ.. వాన్‌పిక్‌కు చెందిన భూములను జప్తు చేసింది.

దీన్ని సవాల్ చేస్తూ వాన్‌పిక్ సంస్థ తొలుత ఈడీ అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీని ఆశ్రయించగా.. అక్కడ ఈడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆపై అప్పిలెట్ అథారిటీ ముందు సవాల్ చేయగా.. దీనిపై మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ ఆదేశించింది.

ఈ తీర్పును హైకోర్టు తప్పుపడుతూ పక్కన పెట్టింది. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులు చట్ట విరుద్ధ‌మని ఒకవైపు చెప్పిన అప్పిలెట్ అథారిటీ మరోవైపు జప్తు భూముల వ్యవహారంలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా చెప్పడం సరైనది కాదని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అభిప్రాయపడింది.

కాబట్టి ఈడీ జప్తు చేసిన 1,416 ఎకరాల భూమిని వెంటనే జప్తు నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఈడీ మరో 11 వేల 804 ఎకరాల భూమిని కూడా జప్తు చేసింది. ఆ భూమికి సంబంధించిన కేసులను పరిశీలన చేయాల్సి ఉందని చెప్పిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.

First Published:  28 Sept 2022 9:15 AM IST
Next Story