భారత్ లో తెలంగాణను ఎంచుకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్... హైదరాబాద్‌లో C4IR ఏర్పాటు
సోమవారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్‌తో సహకార ఒప్పందంపై సంతకం చేశారు. ఇది సదస్సు మొదటి రోజునే తెలంగాణ సాధించిన గొప్ప విజయం.
సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR) యూనిట్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్ణయించింది. ఇది భారతదేశంలోని మొదటి కేంద్రం. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని సంస్థ. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ పాలసీలకు నాయకత్వం వహిస్తుంది.
సోమవారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్‌తో సహకార ఒప్పందంపై సంతకం చేశారు. ఇది సదస్సు మొదటి రోజునే తెలంగాణ సాధించిన గొప్ప విజయం.
నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR) నెట్‌వర్క్‌లో తెలంగాణ లో ఏర్పాటు కాబోతున్నది 18వ కేంద్రం. ఈ కేంద్రం ఏర్పాటుతో C4IR యూనిట్ల గ్లోబల్ నెట్‌వర్క్‌లో తెలంగాణ ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ తన నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
''హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భారతదేశ హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న ఎకో సిస్టమ్, రాష్ట్ర ప్రభుత్వ సమర్థత కూడా హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ను ఏర్పాటు చేయడానికి కారణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్స్ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలలో ఒకటి. హైదరాబాద్‌లో C4IR సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్దికి మరింత సహకరిస్తుంది అన్నారాయన.
ఇది జెనోమిక్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్, హెల్త్‌కేర్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో సహా కొత్త టెక్నాలజీల అభివృద్ధిని సులభతరం , వేగవంతం చేస్తుంది. ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, సమృద్ధిగా ఉన్న టాలెంట్ లభ్యత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్న యూనిట్ కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
''దక్షిణాసియాలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌కు నాయకత్వం వహించడానికి భారతదేశానికి ఒక ప్రత్యేక అవకాశం ఉంది. CFIR తెలంగాణ యూనిట్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్ మద్దతు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మద్దతుతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధిని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.'' అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు.
టీకా, ఔషధాల తయారీలో బలమైన ట్రాక్ రికార్డ్‌తో పాటు పారిశ్రామిక విప్లవ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారతదేశం, హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారుతున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ (హెల్త్‌కేర్) డాక్టర్ శ్యామ్ బిషెన్ అన్నారు.