Telugu Global
Telangana

తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్  హాల్ టికెట్లు విడుదల
X

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీజీఎస్ పీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే గైడ్‌లైన్స్‌ కూడా విడుదల చేసింది.

తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్‌ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది.

First Published:  14 Oct 2024 10:30 AM GMT
Next Story