తెలంగాణలోనూ దీపావళి సెలవులు డబుల్ ధమాకాయేనా..?
వినాయకచవితి, దసరాకు ఇలాగే సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారం దీపావళి సెలవు ఇస్తుందా అనే చర్చ మొదలయింది.
ఈ ఏడాది అధిక ఆషాడ మాసం రావడంతో పండగలన్నీ కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. అంతేకాదు తిథుల్లో తేడాతో ప్రతి పండగా ఏ రోజు చేసుకోవాలన్న గందరగోళమే. వినాయకచవితి, దసరా.. ఇప్పుడు దీపావళికీ అదే పరిస్థితి. దీపావళి తిథి కూడా రెండు రోజులు రావడంతో పండగ ఏ రోజు, సెలవు ఏ రోజు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెలవును 12వ తేదీ నుంచి 13వ తేదీకి మార్చింది. దీంతో తెలంగాణలోనూ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది.
ఏపీలో రెండు రోజులు సెలవులు!
దీపావళి పండుగ నవంబర్ 12వ తేదీ ఆదివారం వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు అందరూ సండే రోజు పండగ అనేసరికి కాస్త నిరాశకు గురయ్యారు. దీంతోపాటు పండగ తిథి ఆది, సోమవారాల్లో కూడా ఉండటంతో సోమవారం 13వ తేదీకి దీపావళి సెలవును మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న జీవో పాస్ చేసింది. దీంతో ఆది, సోమవారాలు రెండు రోజులు సెలవు వచ్చినట్లయింది.
తెలంగాణలోనూ మారుస్తారా..?
వినాయకచవితి, దసరాకు ఇలాగే సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారం దీపావళి సెలవు ఇస్తుందా అనే చర్చ మొదలయింది. నిన్న ఏపీ ప్రభుత్వం సోమవారం దీపావళి సెలవు ప్రకటించిందన్న న్యూస్ బయటికి రాగానే తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌లు ఇలా అన్నిచోట్లా ఇదే ట్రెండింగ్ టాపిక్. ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిమీద నిర్ణయమేమీ ప్రకటించలేదు. ముందు చెబుతున్న ప్రకారమైతే ఆదివారమే ఇక్కడ సెలవు. సోమవారానికి మార్చి దీపావళికి డబుల్ ధమాకా ఇస్తుందేమో చూడాలి.