Telugu Global
Telangana

1.52 లక్షల మంది వీధి వ్యాపారులకు కొత్త లోన్లు ఇవ్వనున్న తెలంగాణ సర్కార్

వీధి వ్యాపారులను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ వారికి లోన్లు మంజూరు చేస్తోంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ సారి 1.52 లక్షల మంది వీధి వ్యాపారులకు కొత్త లోన్లు ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు.

1.52 లక్షల మంది వీధి వ్యాపారులకు కొత్త లోన్లు ఇవ్వనున్న తెలంగాణ సర్కార్
X

తెలం గాణ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ది మీద దృష్టిపెడుతోంది. ప్రతి రంగానికి నిధులు కేటాయిస్తోంది.వివిధ రంగాల్లో పని చేసే ప్రజలను ఆదుకునేందుకు అనేక నిధులను ఖర్చుపెడుతోంది. అంతే కాదు అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా లోన్లు కూడా ఇప్పిస్తోంది. పెట్టుబడులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కొంత కాలం క్రితం పట్టణ ప్రగతి కార్యక్రమం కింద మొదటి విడతలో 3.44 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10,000 రుణం పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో 1.52 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.20,000 రుణాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.



గతేడాది లక్ష్యంగా పెట్టుకున్న‌ 3.44 లక్షల మంది వీధి వ్యాపారులకు 100 శాతం రుణాలు పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది కూడా.


ఇక‌ ఇప్పుడు 142 పట్టణాల్లో వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.20,000 రుణం అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 1.52 లక్షల మందికి రుణాల పంపిణీ లక్ష్యం కాగా 1.91 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.


దరఖాస్తుల పరిశీలన అనంతరం 97,718 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 68,882 మందికి రుణాలు అందజేశారు. మిగతా వారికి కూడా త్వరలోనే పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు.


First Published:  12 Aug 2022 11:29 AM IST
Next Story