Telugu Global
Telangana

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు... 1,479 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి నిర్మాణానికి 1,479 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు... 1,479 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
X

తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడానికి, అవి అనుబందంగా ఉండే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం 1,479 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, జనగాం తదితర‌ ఎనిమిది జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు వాటితో పాటే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఒక్కో మెడికల్‌ కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటాయి. ఈ సీట్ల సంఖ్యకు అనుగుణంగా అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రి అప్‌గ్రేడ్ చేస్తారు.

ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పనులను రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖకు అప్పగించనున్నారు. ఎనిమిది ప్రభుత్వ ఆస్పత్రుల‌ అప్‌గ్రేడేషన్ పనులు, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డయాగ్నస్టిక్, హాస్పిటల్ పరికరాలు, ఫర్నీచర్ తదితర పనులు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSMSIDC) చేపడుతాయి..

ప్రభుత్వం ఒక్కో కళాశాల కు మంజూరు చేసిన నిధుల వివరాలు....

1. రాజన్న సిరిసిల్ల: రూ. 166 కోట్లు

2. వికారాబాద్: రూ. 235 కోట్లు

3. ఖమ్మం: రూ. 166 కోట్లు

4. కామారెడ్డి: రూ. 235 కోట్లు

5. కరీంనగర్: రూ.150 కోట్లు

6. జయశంకర్ భూపాలపల్లి: రూ.168 కోట్లు

7. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్: రూ.169 కోట్లు

8. జనగాం: 190 కోట్లు

First Published:  7 Aug 2022 10:23 AM IST
Next Story