Telugu Global
Telangana

మా పిల్లల చదువులు బాగుపడ్డాయి.. బీఆర్ఎస్ కి జై కొట్టిన పేరెంట్స్

సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మంత్రి హరీష్ రావుని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తమ మద్దతు బీఆర్ఎస్ కేనని ప్రకటించారు.

మా పిల్లల చదువులు బాగుపడ్డాయి.. బీఆర్ఎస్ కి జై కొట్టిన పేరెంట్స్
X

తెలంగాణలోని గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు తమ మద్దతు బీఆర్ఎస్ కేనని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక తమ పిల్లల చదువులు బాగుపడ్డాయని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక గురుకులాల సంఖ్య పెరిగిందని, నాణ్యమైన విద్య, వసతులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మంత్రి హరీష్ రావుని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తమ మద్దతు బీఆర్ఎస్ కేనని ప్రకటించారు.


పిల్లలకు మంచి చదువు, నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేశామని చెప్పారు మంత్రి హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ కు మద్దతుగా ఉంటామని ముందుకొచ్చినందుకు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోషియేషన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడి ఉందని, బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పడకముందు 268 గురుకులాల ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 1000 దాటిందని చెప్పారు. కాంగ్రెస్‌ కు 11 సార్లు అవకాశం ఇచ్చినా ఏంచేయలేదని, ఇప్పుడు మరో ఛాన్స్‌ అని అడుగుతోందని విమర్శించారు హరీష్

కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత గురుకులాలల్లో విద్యను ఇంటర్ వరకు పెంచారని, విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌ లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇప్పటివరకు గురుకులాల్లో చదివిన 6,652 మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యారని తెలిపారు. భవిష్యత్‌ లో గురుకులాలను డిగ్రీ వరకు పెంచే కృషి జరుగుతోందన్నారు హరీష్. గురుకులాల్లో గత ఎనిమిదేళ్లుగా విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వండి పెడుతున్నామని తెలిపారు. అగ్రవర్ణ పేదల కోసం త్వరలోనే 119 నియోజక వర్గాల్లో గురుకులాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తల్లి చేతుల్లో బిడ్డ ఎంత భద్రంగా ఉంటుందో, కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ అంత భద్రంగా ఉంటుందని భరోసా ఇచ్చారు హరీష్ రావు.

First Published:  19 Nov 2023 4:13 PM IST
Next Story