తెలంగాణలో మళ్లీ రైతు రుణమాఫీ..
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఆదేశాలిచ్చారు.
తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు సీఎం కేసీఆర్. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని అన్నారు. తెలంగాణలో మళ్లీ రైతురుణమాఫీ మొదలు పెట్టాలని ఆదేశించారు. రేపటి(గురువారం) నుంచి రుణమాఫీ తిరిగి ప్రారంభించాలని చెప్పారు సీఎం కేసీఆర్.
రైతులకు శుభవార్త
— BRS Party (@BRSparty) August 2, 2023
ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశం. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ. 19,000 కోట్లు రైతు రుణమాఫీ చేయనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. pic.twitter.com/bdsjGDZa8N
ఆలస్యం ఎందుకైందంటే..?
కేంద్రం నోట్లు రద్దు చేయడం వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం, కరోనాతో ఏర్పడిన ఆర్థిక సమస్యలు, FRBM నిధులు విడుదలచేయకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం తదితర కారణాల వల్ల ఆర్థికలోటు ఉందని, అందుకే రుణమాఫీ ఆలస్యమైందని చెప్పారు సీఎం కేసీఆర్. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం, రుణమాఫీపై కీలక ప్రకట చేశారు. ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావు, అధికారులు పాల్గొన్నారు.
వివిధ కారణాల వల్ల కేవలం రైతు రుణమాఫీ మాత్రమే ఆగిందని.. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాటంకంగా కొనసాగిస్తోందని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా, రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
19వేల కోట్లు..
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఆదేశాలిచ్చారు.