మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్!
మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలను అక్కడి కూటమి ప్రభుత్వం తగ్గిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లతో పాటు ఎక్సైజ్ ఆదాయం పెంచడానికి బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు. ఈక్రమంలోనే మద్యం ధరల పెంపునకు ప్రతిపాదనలు వచ్చాయి. మద్యం కంపెనీల నుంచి కూడా ధరలు పెంచాలని ప్రపోజల్స్ అందాయి. మద్యం బ్రాండ్లను బట్టి ఒక్కో బాటిల్ ధర రూ.20 నుంచి రూ.150 వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి బీర్ల ధరలు పెంచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో మద్యంతో పాటు బీర్ల ధరలు కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. లక్ష్యం మేరకు ఆదాయం దక్కించుకోవడానికే ధరలు పెంచనున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి.