మైనార్టీల అభివృద్ధి మా బాధ్యత.. ఇఫ్తార్ విందులో రేవంత్
కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్‌లు రద్దు చేయడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్ల కాదని అన్నారాయన.
మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందులో కాంగ్రెస్, ఎంఐఎం నేతలు, ఇతర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తానే స్వయంగా పండ్లు తినిపించారు సీఎం. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Hon'ble CM Sri.A.Revanth Reddy will participate in Dawat-e-Iftar 2024 at L.B Stadium https://t.co/aZdd2nMGUr
— Telangana Congress (@INCTelangana) March 15, 2024
కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్‌లు రద్దు చేయడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్ల కాదని అన్నారాయన. రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత తమది అని భరోసా ఇచ్చారు. మైనార్టీ స్కూళ్ల భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని తెలిపారు.
ఎంఐఎంతో దోస్తీ..!
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, ఎంఐఎం ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిపై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మాత్రం రెండు పార్టీల నాయకులు ఎలాంటి విమర్శలు చేసుకోలేదు, పైగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంఐఎం నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇటీవల పాతబస్తీ మెట్రో శంకుస్థాపన సమయంలో కూడా ఎంఐఎం నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు అసదుద్దీన్. తాజాగా ఇఫ్తార్ విందులో రేవంత్, అసదుద్దీన్ మధ్య ఆప్యాయత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది.