Telugu Global
Telangana

పేపర్ లీకేజ్ నేపథ్యంలో... TSPSCలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌తో సహా 10 పోస్టులను సృష్టించిన ప్రభుత్వం

HGCL మేనేజింగ్ డైరెక్టర్ , ORR ప్రాజెక్ట్ డైరెక్టర్ BM సంతోష్‌ను TSPSC అదనపు కార్యదర్శిగా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్( CoE)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పేపర్ లీకేజ్ నేపథ్యంలో... TSPSCలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌తో సహా 10 పోస్టులను సృష్టించిన ప్రభుత్వం
X

ఇటీవలి ప్రశ్నపత్రం లీక్ కేసు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నియంత్రణాధికారి (CoE)తో సహా 10 పోస్టులను సృష్టించింది.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) మేనేజింగ్ డైరెక్టర్ , ORR ప్రాజెక్ట్ డైరెక్టర్ BM సంతోష్‌ను TSPSC అదనపు కార్యదర్శిగా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్( CoE)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

CoE కాకుండా, డిప్యూటీ CoE, అసిస్టెంట్ CoE, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులు సృష్టించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ జీఓ ఎంఎస్ 37 జారీ చేసింది.

BM సంతోష్ ను HGCL మేనేజింగ్ డైరెక్టర్ , ORR ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతల నుండి తక్షణమే రిలీవ్ చేసి TSPSCకి రిపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

First Published:  21 April 2023 8:49 PM IST
Next Story