పటేల్ రమేశ్ రెడ్డికి కీలక పదవి.. 37 కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం
నామినేటెడ్ పదవులు పొందినవారిలో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది.
BY Telugu Global17 March 2024 8:58 AM IST
X
Telugu Global Updated On: 17 March 2024 10:59 AM IST
నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. మొత్తం 37 మందిని వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 14నే ఉత్తర్వులు జారీ చేసింది.
నామినేటెడ్ పదవులు పొందినవారిలో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డికి ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్గా పదవి కట్టబెట్టింది. వీరితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కాల్వ సుజాత, పొదెం వీరయ్య, బెల్లయ్య నాయక్ లాంటి కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది.
Next Story