Telugu Global
Telangana

వారం రోజుల్లో మరో 2 గ్యారంటీలు.. కండీషన్లు ఇవే..!

వైట్ రేషన్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌ ఉంటేనే సబ్సిడీ గ్యాస్‌ ఇవ్వనున్నారు. సబ్సిడీ గ్యాస్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ రెడీ చేసింది.

వారం రోజుల్లో మరో 2 గ్యారంటీలు.. కండీషన్లు ఇవే..!
X

మరో రెండు గ్యారంటీల అమలుకు రంగం సిద్ధమైంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500 గ్యాస్‌ సిలిండర్ పథకాలను వారం రోజుల్లో అమలు చేస్తామని కొడంగల్ వేదికగా ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పథకాల అమలుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులు, అధికారులతో రివ్యూ చేశారు.

రూ. 500కే గ్యాస్ సిలిండర్ కండీషన్లు ఇవే..

వైట్ రేషన్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌ ఉంటేనే సబ్సిడీ గ్యాస్‌ ఇవ్వనున్నారు. సబ్సిడీ గ్యాస్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ రెడీ చేసింది. పౌరసరఫరాల సిబ్బంది ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు పరిశీలించి ఆ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. సబ్సిడీ సిలిండర్ల కోసం మూడేళ్ల సగటును ప్రమాణికంగా తీసుకోనుంది ప్రభుత్వం. గత మూడేళ్లలో ఏడాదికి సగటున ఒక కుటుంబం ఎన్ని సిలిండర్లు వాడుతుందో అంచనా వేయనున్నారు. ఉదాహరణకు ఓ కుటుంబం ఈ మూడేళ్లలో ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడితే ఆ 8 సిలిండర్లను 500 రూపాయలకే ప్రభుత్వం ఇవ్వనుంది.

ఏడాదికి ఎన్ని సిలిండర్లు?

అయితే ఏడాది లిమిట్‌ 8 సిలిండర్లు పెట్టాలా? లేదా 5 సిలిండర్లు పెట్టాలా? అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేయాలా? లేదా గ్యాస్‌ ఏజెన్సీలకే డబ్బులు చెల్లించి.. అర్హులకు రూ. 500కే సిలిండర్ ఇప్పించాలా? అనే దానిపై పౌరసరఫరాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. పౌరసరఫరాల అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి గ్యాస్‌ కంపెనీల ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపారు. అటు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల వివరాలు నమోదు చేసుకున్నారు.

First Published:  22 Feb 2024 6:14 AM GMT
Next Story