Telugu Global
Telangana

పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌.. జీవో విడుదల

ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు సమాచారం. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం డిస్కౌంట్ ప్రకటించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు దాదాపు 45 రోజుల వెసులుబాటు కల్పించింది.

పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌.. జీవో విడుదల
X

తెలంగాణలో వాహనదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. పెండింగ్‌ చలాన్లపై రాయితీకి సంబంధించిన ఉత్తర్వులను రవాణా శాఖ జారీ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి చలాన్లపై రాయితీ అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌లో చలాన్లు కట్టుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

జీవో ప్రకారం రాయితీ వివరాలు-

ద్విచక్ర వాహనాలు, ఆటోలు - 80 శాతం

TS RTC బస్సులు - 90 శాతం

కార్లు, ఇతర భారీ వాహనాలు - 60 శాతం

ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు సమాచారం. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం డిస్కౌంట్ ప్రకటించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు దాదాపు 45 రోజుల వెసులుబాటు కల్పించింది. ఆ టైమ్‌లో ద్విచక్ర వాహనాలకు 75 శాతం, మిగతా వాహనాలకు 50 శాతం రాయితీ కల్పించారు. 65 శాతం చలాన్లు క్లియర్‌ కాగా.. దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.

ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటిలోనూ ఈ వెసులుబాటు కల్పించింది. అన్ని రకాల వాహనాలపై చలాన్లకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. బెంగళూరులో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ. 22 కోట్లు వసూలయ్యాయి.

First Published:  26 Dec 2023 4:53 PM IST
Next Story