Telugu Global
Telangana

రోడ్ల రిపేర్ కోసం 2,500 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం కోసం టెండర్లను త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వం రోడ్లు & భవనాల శాఖను కోరింది. మంజూరైన మొత్తంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లు కేటాయించారు.

రోడ్ల రిపేర్ కోసం 2,500 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
X

రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం కోసం టెండర్లను త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వం రోడ్లు & భవనాల శాఖను కోరింది. మంజూరైన మొత్తంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లు కేటాయించారు.

డిసెంబర్ 10న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశంలో రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.

ఇందుకోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించగా, ఆ మేరకు నిధులు మంజూరయ్యాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాఖ అధికారులను కోరారు.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి (రూరల్‌) సర్కిళ్లలో రోడ్లపై పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

అధికారుల చెప్తున్న వివరాల ప్రకారం, మొత్తం 27,521 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులలో, 664 చోట్ల 1,675 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కింద మొత్తం 1,087 కల్వర్టులు, రోడ్లు కూడా వర్షం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మరమ్మతులకు టెండర్లు పిలిచి రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

First Published:  26 Dec 2022 8:41 AM IST
Next Story