ఇందిరమ్మ ఇళ్ల గైడ్‌లైన్స్ ఫైనల్.. అర్హతలు ఇవే!
మార్గదర్శకాలు దాదాపు ఫైనల్ అయ్యాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 4 లక్షల 16 వేల ఇళ్లు కేటాయించనుంది ప్రభుత్వం. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేయనుంది ప్రభుత్వం.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ఈ నెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందించాలని నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన తర్వాత ఆధార్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. సొంత స్థలమున్న వారికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందించనుంది. స్థలం లేని వారికి స్థలంతో పాటు నిర్మాణ ఖర్చుల కోసం రూ.5 లక్షలు అందించనుంది.
ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు దాదాపు ఫైనల్ అయ్యాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 4 లక్షల 16 వేల ఇళ్లు కేటాయించనుంది ప్రభుత్వం. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేయనుంది ప్రభుత్వం.
ఇందిరమ్మ ఇళ్ల అర్హతలు ఇవే-
-- లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు -BPL దిగువన ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి గుర్తింపు
-- లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి
-- గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులే.
-- గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధిలో వారై ఉండాలి
-- వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు
-- ఒంటరి, వితంతు మహిళలూ లబ్ధిదారులే
మంజూరు ఇలా -
-- ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళ ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
-- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
-- గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక
-- లబ్ధిదారుల జాబితా గ్రామ సభలో ప్రదర్శించాక రివ్యూ చేసి ఫైనల్ చేస్తారు.
-- జిల్లాలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి.
-- 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం సపరేట్‌గా ఉండాలి. RCC రూఫ్‌తో ఇంటిని నిర్మించాలి.
నగదు సాయం ఇలా -
బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష
రూఫ్ స్థాయిలో రూ. లక్ష
పైకప్పు పూర్తయ్యాక రూ.2 లక్షలు
నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష