Telugu Global
Telangana

మయోనైజ్‌పై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government has banned mayonnaise

మయోనైజ్‌పై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మయోనైజ్‌ నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని నందినగర్ లో మోమోస్ లో మయోనైజ్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 20 మందిదాకా ఆసుపత్రుల పాలయ్యారు. అలాగే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తరుచూ ఇలాంటి ఘటనలు జగరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది

First Published:  30 Oct 2024 7:26 PM IST
Next Story