నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
BY Vamshi Kotas11 March 2025 6:09 PM IST

X
Vamshi Kotas Updated On: 11 March 2025 6:09 PM IST
నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి పథకం కోసం యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సాయం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్దిదారులకు పథకాలు అందుతాయి అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ పథకంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది అని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన తెలిపారు.
Next Story