Telugu Global
Telangana

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్... ఇది కూడా ఒన్ సైడ్ లవ్ వ్యవహారమేనా ?

ఆ యువతికి రెండు రోజుల క్రితం మరో యువకుడితో నిశ్చితార్దం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల‌ ప్రాంతంలో ఆ యువతి, ఆమె తండ్రి ఆ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలకోసం వెళ్ళారు. పూజలు ముగించుకొని గుడి బైటికి రాగానే గుడి బైట కారులో వేచి ఉన్న దుండగులు యువతిని కిడ్నాప్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్... ఇది కూడా ఒన్ సైడ్ లవ్ వ్యవహారమేనా ?
X

హైదరాబాద్, ఆదిబట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ వ్యవహారం మర్చిపోకముందే మరో కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశారు.

చందుర్తి మండలం మూడేపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన సిసిటివిలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ యువతికి రెండు రోజుల క్రితం మరో యువకుడితో నిశ్చితార్దం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల‌ ప్రాంతంలో ఆ యువతి, ఆమె తండ్రి ఆ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలకోసం వెళ్ళారు. పూజలు ముగించుకొని గుడి బైటికి రాగానే గుడి బైట కారులో వేచి ఉన్న దుండగులు యువతిని కిడ్నాప్ చేశారు. ఆ యువతి పారిపోతుండగా ఆమె వెంటపడి పట్టుకొని కారు ఎక్కించారు. ఆమెను రక్షించడానికి వచ్చిన ఆ యువతి తండ్రిని కిడ్నాపర్లు పక్కకు నెట్టారు, ఆపై బాధితురాలిని తీసుకొని కారులో వేగంగా పారిపోయారు. కిడ్నాపర్లలో ఒకరు మొహానికి ముసుగు ధరించాడు.

అమ్మాయి తండ్రి కారును వెంబడించడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాలికను రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అధికారులు ఆ ప్రాంతంలోని హైవేపై ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కారును గుర్తించారు.

ఈ కిడ్నాప్ వ్యవహారంలో అదే గ్రామానికి చెందిన కె. జాన్ అనే యువకుడి ప్రమేయం ఉన్నట్లు బాలిక కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

గ్రామస్తుల కథనం ప్రకారం.. నిందితుడు ఏడాది క్రితం ఇదే అమ్మాయిని తీసుకొని గ్రామం విడిచి పారిపోయాడు.

అమ్మాయి మైనర్ కావడంతో బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతను జైలు కుడా వెళ్ళి వచ్చాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. అందువల్లే జాన్ ఈ కిడ్నాప్ కు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.


First Published:  20 Dec 2022 1:04 PM IST
Next Story