Telugu Global
Telangana

పోరాట యోధుడే పాలకుడై.. కేటీఆర్ దశాబ్ది ట్వీట్

తెలంగాణ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ ఉద్విగ్న క్షణాలను మరోసారి అందరికీ గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు.

పోరాట యోధుడే పాలకుడై.. కేటీఆర్ దశాబ్ది ట్వీట్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. #TelanganaFormationDay #TelanganaTurns10 అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ ఉద్విగ్న క్షణాలను మరోసారి అందరికీ గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ వేశారు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

పోరాట యోధుడే పాలకుడై..

సాధించిన తెలంగాణను సగర్వంగా...

దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...

దశాబ్ది వేడుకలను

ఘనంగా జరుపుకుంటోంది

మన తెలంగాణ నేల...

కేవలం పదేళ్లలోనే...

వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..

తెలంగాణ తోబుట్టువులందరికీ..

రాష్ట్ర అవతరణ

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా

హృదయపూర్వక శుభాకాంక్షలు

జై తెలంగాణ

జై భారత్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.


వెబ్ సైట్ ఆవిష్కరణ..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్ సైట్ (dashabdi.telangana.gov.in) ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన ఈ వెబ్ సైట్ ప్రారంభించారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. 21రోజులపాటు జరిగే కార్యక్రమాల వివరాలు, లైవ్ అప్ డేట్స్ ని కూడా అందిస్తున్నారు.


కేంద్రాన్ని దారికి తెస్తాం, తెలంగాణ సాధిస్తాం.. అంటూ కేసీఆర్ 22 ఏళ్లక్రితం ఇచ్చిన స్టేట్ మెంట్ ని కూడా మరోసారి గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అప్పటి న్యూస్ పేపర్ ని తన ట్వీట్ కి జతచేశారు.



First Published:  2 Jun 2023 1:24 AM GMT
Next Story